నవ తెలంగాణ కు స్పందన

– కీచక ఉపాధ్యాయుడు సస్పెండ్ ….
నవతెలంగాణ ఆర్మూర్;
  మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయుడు ఇబ్రహీం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుల్తానా లను సస్పెండ్ చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి పింజ రాజా గంగారాం శనివారం తెలిపారు. విద్యార్థినిలతో అసభ్య ప్రవర్తన… శనివారం నవ తెలంగాణలో ప్రచురితమైన వార్తకు జిల్లా విద్యాశాఖ అధికారి విచారణ చేసి ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినారు.. ఇద్దరినీ సస్పెండ్ చేసినారు.