
– ముగ్గురిపై కేసు నమోదు
నవతెలంగాణ- తాడ్వాయి : పల్లెల్లో ఏరులైపాడుతున్న గుడుంబా అని శీర్షిక నవ తెలంగాణ దినపత్రికలో బుధవారం ప్రచురితమైంది. దీనికి ఎక్సైజ్ అధికారులు స్పందించి తాడ్వాయి మండలంలోని నార్లాపూర్, రెడ్డిగూడెం, సరిహద్దు మండలం గోవిందరావుపేట మండలంలోని పాపయ్యపల్లి గ్రామాల్లో గుడుంబా స్థావరాలు పై సోదాలు నిర్వహించి, దాడులు నిర్వహించారు. తీగ లాగితే డొంక కదిలిన చందంగా డైరెక్టర్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ హైదరాబాద్ కమలహాసన్ రెడ్డి ఆదేశాల మేరకు దీప్తి కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ వరంగల్ డివిజన్ అంజన్ రావు పర్యవేక్షణలో జిల్లా ప్రొఫెషన్ ఎక్సైజ్ అధికారి భూపాలపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రొఫెషన్ ఎక్సైజ్ ములుగు పరిధిలోని తాడ్వాయి మండలం నార్లాపూర్ రెడ్డిగూడెం సరిహద్దు మండలం, గోవిందరావుపేట పాపయ్యపల్లి గ్రామాలలో విస్తృత ధాడు నిర్వహించి నాటుసారలపై స్టేట్ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్, ఎన్ఫోర్స్మెంట్ వరంగల్ డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ భూపాల్ పల్లి మరియు ములుగు స్టేషన్ సిబ్బంది విస్తృత దాడులు నిర్వహించారు. 1500 పులియబెట్టిన బెల్లం పానకం ధ్వంసం చేశారు. 15 లీటర్ల నాటు సారా, 10 కిలోల పట్టికను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిషేధిత గుడుంబా తయారీ కోసం ఉపయోగించే ముడి పదార్థాలను బెల్లం, పట్టిక అమ్మిన వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో స్టేట్ టాస్క్ ఫోర్స్ సీఐ లతీఫ్, డిస్టిక్ టాస్క్ ఫోర్స్ సి ఐ ఆర్ రాజ సమ్మయ్య, ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై ఎం కిషోర్ బాబు, ములుగు ఎక్సైజ్ ఎస్సై ఆర్ రాజన్న మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.