నవతెలంగాణ వార్తకు స్పందన…

– ప్లెక్సీలను తొలగించిన అధికారులు..
నవతెలంగాణ-బెజ్జంకి
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో మండలంలో  అయా రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా ఏర్పాటుచేసిన ప్లెక్సీలను తొలగించడంలో  అధికారుల అలసత్వం..! శీర్షికతో నవతెలంగాణ దిన పత్రిక శుక్రవారం వార్తను ప్రచురించింది. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రనీత్ రెడ్డి నవతెలంగాణ వార్తకు స్పందించారు.పంచాయతీ సిబ్బందితో అయా రాజకీయ పార్టీల ఏర్పాటుచేసిన ప్లెక్సీలను తొలగించారు.ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్భందీగా అమల్లో ఉందని అనుమతుల్లేకుండా ఎవరూ ప్లెక్సీలను ఏర్పాటుచేయవద్దని పంచాయతీ కార్యదర్శి ప్రనీత్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిస్తే చట్టపరమైన చర్యలు చేపడుతామని పంచాయతీ కార్యదర్శి తెలిపారు.