నవతెలంగాణ – కామారెడ్డి
మనకు హక్కులతో పాటు బాధ్యతలు కూడా ముఖ్యమని మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజనరసు అన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం కార్మికులతో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఉదయం ఐదు గంటలకు తోటి కార్మికులతో మాట్లాడుతూ.. కార్మికులకు హక్కులు ఎంత ముఖ్యమో బాధ్యతలు కూడా అంతే ముఖ్యమని మున్సిపల్ కార్మికులు లేకుండా, ఆప్సేంట్ లేకుండా రోజు విధులకు రావాలని అలా రావడం వలన కామరెడ్డి ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామని డ్యూటీ కి రాకుండా కార్మికులు రాకపోవడం వలన ప్రజా ఆరోగ్యం కొంటుపడుతుందని కావున అందరూ డ్యూటీ లోకి రావాలని వారు తెలిపారు మున్సిపల్ చైర్ పర్సన్ మేడం శ్రీమతి గడ్డం ఇందుప్రియా చంద్రశేఖర్ రెడ్డి మనకోసం జీతాలు ప్రతినెల అచ్చే విధంగా అలాగే ఏరియాస్, పెండింగ్ పీఎఫ్ డబ్బులు త్వరలోనే అందరికీ అకౌంట్లో జమ చేస్తామని మున్సిపల్ కార్మికులకు మంచి నాణ్యమైన బట్టలు పెడతానని, కార్మికులకు రావలసిన జీతాలు బెనిఫిట్స్ అన్ని మా హయాంలో కార్మికుల కార్మికులకు కుటుంబాలు బాగుండేలా కార్మికుల సంక్షేమమే మా ధ్యేయమన్నారు. మాట ఇచ్చారు వారి మాట మనము నిలబెట్టుకోవాలంటే మనము డ్యూటీలు సక్రమంగా చేసి పురా ప్రజలకు చక్కటి ఆరోగ్యాన్ని అందించాలని కార్మికులకు సూచించారు. మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఆయన అన్నారు.