
భీంగల్ నూతన తహసీల్దార్ గా శ్రీలత, ఎంపీడీవోగా సంతోష్ కుమార్ బుధవారం భాద్యతలు చేపట్టారు. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేసిన శ్రీలత భీంగల్ కు బదిలీపై రాగా ఇక్కడ పనిచేసిన వెంకటరమణ డొంకేశ్వర్ మండలానికి బదిలీపై వెళ్లారు. జగిత్యాల జిల్లా రాయికల్ ఎంపీడీవో గా పనిచేసిన సంతోష్ కుమార్ భీంగల్ కు బదిలీపై రాగా, ఇక్కడ పనిచేసిన రాజేశ్వర్ కామారెడ్డి మండలంలోని గాంధరికి బధిలిపై వెళ్ళారు.