ప్రత్యేక అధికారి బాధ్యతలు

నవతెలంగాణ – మాక్లూర్ 
మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా జే. ముతన్న బాధ్యతలను గురువారం స్వీకరించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షుడి పదవి కాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించింది. మండల ప్రత్యేక అధికారీగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి జె. ముత్తెన్న నియమితులయ్యారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతి, ఎంపీఓ  శ్రీనివాస్, పంచాయతీ రాజ్ ఏఈ శ్రీనివాస్, కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.