నవతెలంగాణ – గుండాల
ఇటీవల గుండాల మండల పరిధిలోని పోతిరెడ్డిగూడెం గ్రామంలో ఎరగడి పడి ప్రమాదవశాత్తు పది మంది రైతులకు చెందిన సుమారు 25 ఎకరాల మొక్కజొన్న చేలు పూర్తిగా దగ్ధమై, పంట నష్టం తీవ్రంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మండల కేంద్రానికి చెందిన వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్ అధ్యక్షులు, ప్రముఖ వ్యాపారస్తులు మానాల వెంకటేశ్వర్లు నష్టం వాటిల్లిన పంటచేలను ఆదివారం స్వయంగా పరిశీలించి. బాధిత రైతులకు సాగు సాయంగా రానున్న ఖరీఫ్ సీజన్ లో 80 యూరియా కట్టలతో పాటు విత్తనాలు సైతం ఇతోధికంగా అందిస్తానని ప్రకటించి భరోసా కల్పించారు. సాటి మనిషిగా ఇంతటి ఔదార్యాన్ని చాటిన మానాల వెంకటేశ్వర్లుకు బాధిత రైతులు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు మండల వాసులు మానాల వారి దయా హృదయాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గుండాల జెడ్పీటీసీ వాగబోయిన రామక్క, మానాల ప్రణీత్, బాధిత రైతులు పాల్గొన్నారు.