
– ఎన్.పి.డి.సీ.ఎల్ (ఆపరేషన్స్) ఏడీఈ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఇటీవల ధ్వంసం అయిన పెద్దవాగు ప్రాజెక్ట్ ముంపు ప్రాంతంలో అపార నష్టం వాటిల్లింది.దీంతో శాఖల వారీగా పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. విద్యుత్ శాఖ యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్దరణ పనులు చేపడుతుంది.న్.పి.డీ.సీ.ఎల్( ఆపరేషన్స్) ఏడీఈ వెంకటేశ్వర్లు నేతృత్వంలో శుక్రవారం నుండే ఈ పనులు ప్రారంభించారు.24 లోపే విద్యుత్ సరఫరా చేసామని,ఇంకా పనులు సాగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు విద్యుత్ పోల్స్ 300,ట్రాన్స్ఫార్మర్స్ 60,20 కి.మీ మేర విద్యుత్ లైన్ ధ్వంసం అయ్యాయని వీటి అంచనా సుమారు రూ.3 కోట్లు ఉంటుందని తెలిపారు. ఆయన ఏఈ లు,ఎల్.ఐ లు,లైన్ మేన్ లు పనుల్లో నిమగ్నమయ్యారు.