ప్రయాణానికి అడ్డంకి ఏర్పడ్డా రోడ్డు పనులు పునరుద్ధరణ.

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని ప్రభూత్వ జూనియర్ కళాశాల వద్ద అనోలోచితంగా వర్షకాలం ఉందని తెల్సిన సదరు గుత్తేదారుడు సుమారుగా రూపాయలు ఐదుకోట్ల వ్యయంతో  రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో  నిర్మాణం మే 2023లో ప్రారంబించారు. ప్రయాణికులకు ఇదే ప్రధాన రోడు కావడంంతో ట్రాఫిక్  హెవిగా ఉంటుంది. నిర్మాణం మెుదలు పెట్టినప్పుడు సైడ్ కు సర్వీస్ రోడు వేసి సౌకర్యం కల్పించారు. నాటి నుండి పనులు నాణ్యత లోపంతో పనులను అడ్డ గోలుగా శరవేగంగా కోనసాగిస్తున్నారు. ఎన్నికలకు ముందుగానే పూర్తవ్వలనే ఉద్దేశంతో హడావిడిగా పనుల నిర్మాణం జర్గుతోంది ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి . సంభందిత ఆర్&బీ శాఖ అధికారుల పర్యవేక్షణ వెరసి పనులు సక్రమంగా నిర్వహిస్తలేరనేది మండల వాసులు ఆరోపణలు చేస్తున్నారు. నాటి నుండి వర్షం రెండుసార్లు రోడు ద్వంసం అయింది. వర్షం  పడినప్పుడల్లా సమస్యలను వాహనదారులకు, స్థానికులకు,  ప్రయాణికులకు నరకయాతన పడుతున్నారు.ఇటివలే పడిన వర్షానికి  నీటీ ఉదృతికి సర్వీస్ మట్టి రోడు కోట్టుకోని  పోవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోయి రెండు రోజుల కొద్ది ఇబ్బందులు పడుతున్నారు, హైద్రాబాద్, బిచ్కుంద నుండి జుక్కల్ వచ్చే బస్సులు, లోకల్ బస్సులు,  వారికి కష్టాలు తప్పడం లేదు. వాహనాలను, బస్సులు  వెనక్కి తిప్పుకునికి  వెళ్లాల్సిన దుస్తితి నెలకొంది. రెండు మూడు రోజులుగా పడుతున్న వర్షానికి సర్వీస్ రోడు వరద నీటీ ఉదృతికి ద్వసం అయి కొట్టుకోని పోయింది. రెండురోజులుగా వాహనాలు వెళ్ల లేని దుస్తితి నెలకొంది. మంగళ వారం  రోజు మరమ్మత్తులు చేసేందుకు జుక్కల్ సర్పంచ్ బొంపెలి రాములు జీపి  అధికారులతో  కలిసి పరీశీలించారు. మరమ్మత్తు పనులను దగ్గరుండి చేయిస్తున్నారు, పనులు పూర్తవ్వగానే వావానాలకు ఇబ్బందులుండవని జుక్కల్ సర్పంచ్ రాములు తెలిపారు.