– మణిపూర్ సర్కారును కోరిన నాగా విద్యార్థి సంఘాలు
ఇంఫాల్ : మణిపూర్‌లోని ఉఖ్రుల్, ఛండేల్ జిల్లాలలో వెంటనే మొబైల్ ఇంటర్నెట్‌ను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాలు కోరాయి. రఫేల్ కాటమ్నావ్ లాంగ్, నాగా విద్యార్థి సంఘంలు ఈ అభ్యర్థనను చేశాయి. ఉర్ఖుల్‌లో నాగాలు అధికంగా ఉంటారు. ఛండేల్‌లోనూ నాగాలు గణనీయమైన సంఖ్యలో వీరి జనాభాను కలిగి ఉంటారు. మణిపూర్‌లో జాతి హింస చెలరేగిన తర్వాత గతనెల 23న రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్‌పై నిషేధాన్ని ఎత్తేసింది. అయితే, మూడ్రోజుల తర్వాత ఇద్దరు మెయిటీ విద్యార్థుల హత్యపై ఇంఫాల్‌లో వేలాది మంది ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేయటంతో అధికార యంత్రాంగం మొబైల్ ఇంటర్నెట్‌పై మళ్లీ నిషేధాన్ని విధించింది. ఈ నిషేధాని ఈనెల 11 వరకు పొడిగించారు. ఉఖ్రుల్, ఛండేల్‌లలో మొబైల్ ఇంటర్నెట్ బ్యాన్ కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు విద్యార్థి సంఘాలు ఆందోళనను వ్యక్తం చేశాయి. శాంతియుతమైన ఈ ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ బ్యాన్‌ను తప్పుబట్టాయి.