భారీ వాహనాలపై ఆంక్షలు ఎత్తివేయాలి

నవతెలంగాణ-జన్నారం
జన్నారంలోని కవ్వాల్‌ టైగర్‌జోన్‌ పరిధిలోని గ్రామాల్లో అటవీ అధికారులు భారీ వాహనాలకు పెట్టిన ఆంక్షలు ఎత్తివేయాలని సామాజిక ఉద్యమకారుడు భూమాచారి బుధవారం జన్నారం మండలంలోని మొర్రిగూడ గ్రామంలో విస్తత ప్రచారం నిర్వహించారు. అలాగే అన్ని గ్రామాల్లో ఈ ప్రచారం నిర్వహించి ప్రజలను ఐకమత్యం చేసి భారీ వాహనాల ఆంక్షలు ఎత్తివేసే విధంగా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి తిరుపతి, బత్తుల ప్రకాష్‌, మూగల వెంకటేష్‌ నేత, కొండపల్లి మహేష్‌. బాణావత్‌ రాజు నాయక్‌, గంగాధర్‌ నాయక్‌, రమేష్‌ పాల్గొన్నారు.