త్వరలో గోఫస్ట్‌ సర్వీసుల పునరుద్ధరణ

న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని రెండున్నర నెలల క్రితం విమానయాన సేవలను రద్దు చేసుకున్న గోఫస్ట్‌ సర్వీసులు త్వరలోనే పునరుద్దరణకు నోచుకోనున్నాయి. ఇందుకు కొన్ని షరతులతో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) ఆమోదం లభించింది. ఈ నెల 15న గోఫస్ట్‌ తన విమాన సర్వీసుల పునరుద్ధరణ ప్రణాళికను సవరించింది. 15 విమానాలతో ప్రతి రోజూ 114 విమాన సర్వీసులు నడుపుతామని పేర్కొంది. ఈ సవరణ ప్రతిపాదనను ఆమోదించిన డిజిసిఎ తాజాగా కొన్ని షరతులతో సేవల పున ప్రారంభానికి అనుమతులు ఇచ్చింది.