నవతెలంగాణ-డిచ్ పల్లి : డిచ్ పల్లి మండలం లోని డలంలోని సుద్దపల్లి-దేవ్ పల్లి సీఎంసీ యాజమాన్యం అక్రమంగా నిర్మించిన ప్రహారీ గోడను నిలిపివేసి, వేంటనే తొలగించాలని మండల బీజేపీ అధ్యక్షులు వెంకటరమణ అన్నారు. ఆదివారం డిచ్ పల్లి మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ సుద్దపల్లి రెవెన్యూ పరిధిలోని దేవ్పల్లి గ్రామపంచాయతీ తుట్టకుంట కట్ట వెంబడి సీఎంసీ యాజమాన్యం ప్రహారీగోడ నిర్మించటం జరిగిందని, ఇట్టి అక్రమ కట్టడాలు అధికారుల కళ్లకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. సుద్దపల్లి రెవెన్యూకు సంబంధించిన సర్వే నెం. 613లో 10-23 గుంటల భూమి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇలాంటి చర్యలకు సీఎంసీ యాజమాన్యం పాల్పడటం ఎంతవరకు సమంజసమన్నారు. ఇట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. చెరువుకు సంబంధించిన ఇరిగేషన్, ఆర్అండ్ బి అధికారులు ప్రహారీగోడ నిర్మిస్తుంటే ఎలా చూస్తూ ఉన్నారని, ఇట్టి నిర్మాణాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటారన్నారు. లేని యెడల రెవెన్యూకు సంబంధించి సుద్దపల్లి, దేవ్పల్లి, అమృతాపూర్ గ్రామాల్లోని ప్రజలు చేరుకుని నిరసన, ర్యాలీ కార్యక్రమాలు చేపడుతారన్నారు. ఈ విషయాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పరిశీలించి న్యాయం చేయాలన్నారు. సమావేశంలో బీజేపీ కార్యవర్గ సభ్యులు రవిగౌడ్, అమృతాపూర్ సర్పంచ్ స్వామి, బీజేవైయం మండల అధ్యక్షులు రవి, ఉపాధ్యక్షులు దిలీప్, బాలన్న, తేజ, రాజ్కుమార్తో పాటు నాయకులు పాల్గొన్నారు.