
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో టీజీఓ అధ్యక్షులు అలుక కిషన్ ను ఘనంగా సన్మానించారు. నగరంలోని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో అధ్యక్షులు రవీంధర్ అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీజీఓ అధ్యక్షులు అలుక కిషన్ కు దేశరత్న అవార్డు వచ్చిన సంధర్బంగా ఆయనను సన్మానిస్తున్నట్లు తెలిపారు. టీఎన్జీఓ అధ్యక్షునిగా, జెఎసీ చైర్మన్ గా, కరోనా 19 సమయంలో అలుక కిషన్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ కే. బోజగౌడ్, ఆశయ్య, పండరినాథ్, రాజారాం, స్వామిదాస్, బాజగౌడ్, రవీందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, గంగా కిషన్ పాల్గొన్నారు.