నవతెలంగాణ – జక్రాన్ పల్లి
గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థలో పని చేసినటువంటి కమ్యూనిటీ కోఆర్డినేటర్ సరోజాను డిఆర్డిఏ పిడి సాయ గౌడ్ శుక్రవారం పూలమాలలతో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డిఆర్డిఏ పిడి సాయ గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థలో పనిచేయడం చాలా మంచి అదృష్టమని, పేదలకు సహాయం చేసే అవకాశం వచ్చిందని అవకాశాన్ని సరోజ వినియోగించుకుందని అన్నారు. జిల్లా కేంద్రంలోని డిఆర్డిఏ పిడి సాయి గుడ్ ఛాంబర్ వద్ద ఏపీడి రవీందర్, డిపియం లు, ఏపియంలు ఘనంగా సత్కరించారు.