
నవతెలంగాణ -తాడ్వాయి :
మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ టీచర్ బంగారు నారాయణ దశదినకర్మకు బుధవారం సామాజిక న్యాయవేదిక మహిళా అధ్యక్షురాలు మడే పూర్ణిమ, వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, బంధు మిత్రులతో కలిసి వచ్చి ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రిటైర్డ్ టీచర్ బిఎస్ నారాయణ చాలా మంచి వ్యక్తి అని గ్రామంలో అందరితో కలిసి మెలిసి ఉండేవాడిని ఇలాంటి వ్యక్తి, మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ రిటైర్డ్ అసిస్టెంట్ కొక్కెర సారయ్య, తుడుం దెబ్బ జిల్లా ఇన్చార్జి అధ్యక్షుడు ఎట్టి ప్రకాష్, బంగారు వినయ్, రాహుల్, వారి కుమారులు బంధుమిత్రులు వివిధ పార్టీల నాయకులు ప్రజాసంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.