నవతెలంగాణ – డిచ్ పల్లి
దశాబ్ద కాలంగా పాలకులు ప్రభుత్వాలు విద్యారంగం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నత విద్యారంగాన్ని నిర్వీర్యం చేసినారని తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టూటా) అధ్యక్షులు డాక్టర్ ఎ. పున్నయ్య పేర్కొన్నారు. గురువారం తెలంగాణ యూనివర్సిటీ లో జరిగిన టూట ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఎం పున్నయ్య పాల్గొని మాట్లాడుతూ మానవ వనరుల అభివృద్దే రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా ఉంటుందన్నారు. ఈ ప్రభుత్వం ఉన్నత విద్యా రంగంలో పనిచేస్తున్న యూనివర్సిటీ అధ్యాపకులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల ప్రకారం 60 నుండి 65 సంవత్సరాలకు పదవీ విరమణ వయస్సు పెంచాలని, యూనివర్సిటీ లో ఉన్న అధ్యాపక అధ్యాపకేతర ఖాళీలను వెంటనే రిక్రూట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన టూట ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్ బాబు మాట్లాడుతూ రివైజ్డ్ పేరివిజన్ కమిటీ -2016 ప్రకారం అధ్యాపకులకు రావలసిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. అదేవిధంగా యూనివర్సిటీ లో పనిచేసే ఉద్యోగులందరికీ హెల్త్ కార్డ్‌లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ తీర్మానాలను తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.యాదగిరి ద్వారా ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం కు పంపారు. ఈ కార్యక్రమంలో టూటా ఉపాధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ రాజేశ్వరి కార్యదర్శులు డాక్టర్ బాలకిషన్, డాక్టర్ నీలిమ, కోశాధికారి డాక్టర్ ఈ నాగరాజ్, ఈసీ మెంబర్లు డాక్టర్ ప్రసన్న రాణి డాక్టర్ జమీల్ తదితరులు పాల్గొన్నారు.