– సిఐటియు జిల్లా అధ్యక్షులుదాసరి పాండు
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : అంగన్వాడి టీచర్లకు ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు దాసరి పాండు అన్నారు. సోమవారం రోజున సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆయాకు రెండు లక్షలు టీచర్కు 5 లక్షలు చెల్లించాలని రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ల పట్ల ఆయన పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడి ఉద్యోగస్తులు అనేక ఉద్యమాలు చేయడం జరిగిందని పెరుగుతున్న ధరలకు అనుకూలంగా వేతనాలు పెంచాలని వాటితోపాటు అనేక సంవత్స రాల నుండి పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పెంచాలని ఐదు లక్షలు టీచర్కు ఆయాకు రెండు లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తూసమ్మె కూడా చేయడం జరిగింది సమ్మె సందర్భంగా అధికారం ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా 50000 ఆయాకు లక్ష టీచర్ కనేది నిర్ణయం చేసినమని కూడా చెప్పడం జరిగింది గ్రామాలలో పిల్లలను విద్యావంతులుగా చేస్తూ అదే విధంగా ఆరోగ్యపరంగా కూడా వాళ్లను ప్రతిష్టపరిచే దాంట్లో అనేక సేవలు అందిస్తున్న అంగన్వాడి టీచర్లకు ఆయ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండాలని వెంటనే వారి న్యాయమైన డిమాండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మరియు వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలువేరు రమాకుమారి, ఎల్లమ్మ, ఉపేంద్ర , సునీత, లక్ష్మీబాయి, సరూప లు పాల్గొన్నారు.