
పూణేలోని సి డాక్ కంపెనీలో సెక్యూరిటీ సూపర్వైజర్ గా బాధ్యతలు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న సందర్భంగా నిజామాబాద్ ఓడ్ కుల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో సురేష్ పవర్ కు శాలువాతో బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంచార ఓడ్ కులంలో పుట్టి జాతీయ స్థాయిలో రికగ్నైజేడ్ సంస్థలో పనిచేసి రిటైర్మెంట్ పొందడం చాలా గర్వకారణంగా భావిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి జాదవ్ రాజు తెలిపారు. తెలంగాణలో తమ కులంకు గుర్తింపు పొంది కేవలం మూడు సంవత్సరాలు కావస్తుందని రాష్ట్రంలో కూడా తమ కులస్తులకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో జాదవ్ రాజు, పవర్ విజయ్, జాదవ్ నారాయణ, జాదవ్ శరత్, సాలుంకే రమేష్, సాలుంకే సుధీర్, చవాన్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.