తోకల చంద్రకళ వెంకన్నకి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

నవతెలంగాణ – చండూరు
మున్సిపల్ మాజీ  చైర్ పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న  ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా   మున్సిపల్ పట్టణంలో  ఉత్తమ సేవలు అందించినందుకు గాను  శుక్రవారం తెలంగాణ భవనంలో  టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్, మాజీ మంత్రి గుంత కండ్ల జగదీశ్వర్ రెడ్డి, కి పుష్పగుచ్చాలు, జ్ఞాపిక  అందించి, శాలువాతో సన్మానం చేసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో   మరిన్ని పదవులు అనుభవించాలని, ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.  ఈ సన్మాన కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు.