ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి: పీడీ

– పదవీ విరమణ పొందిన సీడీపీఓ గంధం పద్మావతి
– ఘనంగా సన్మానించిన ఉన్నతాధికారులు
నవతెలంగాణ – పెద్దవూర
ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని వారి శేషు జీవితం నిండు నూరేళ్లు ఆయుష్షు ఆరోగ్యాలతో కొన సాగాలని జిల్లా మహిళా శుషు సంక్షేమ శాఖ అంగన్వాడీ పీడీ సక్కుబాయి అకాంక్షించారు. శుక్రవారం అనుముల మండలం హాలియా మున్సిపాలిటీలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనం లో జరిగిన అనుముల అంగన్వాడీ ప్రాజెక్టు ఐసీడీఎస్, సీడీపీఓ గంధం పద్మావతి పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు. అంగన్వాడీ సంస్థలో వివిధ హోదాలలో పనిచేశారని, వారు చేసిన సేవలు మరువలేనివని, అంకితభావంతో పని చేసి అందరి మన్నలను పొందారని అన్నారు. సూపర్ వైజర్లు మాట్లాడుతూ.. మాకు ఒక అమ్మలాగా సలహాలు, సూచనలు ఇస్తూ అనుముల ప్రాజెక్టు చేసిన సేవలు చిరకాలం గుర్తు ఉంటాయాని కంటతడి బెట్టారు. అనంతరం కేక్ కట్ చేసి పూల మాలాలు, షాలువాతో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏపీడీఓ వేణు, ఏసీడీపీఓ సువర్ణ, పద్మావతి తల్లి భద్రమ్మ కుటుంభ సభ్యులు, ప్రాజెక్టు సూపర్ వైజర్లు వెంకాయమ్మ, రమాదేవి,సరిత, గౌసియా బేగం, కమలాబాయి, సైదా బేగం, రాజేశ్వరి, నాగమణి, యాదమ్మ, విజయ లక్ష్మి, గతంలో ఇక్కడ పనిచేసిన సూపర్ వైజర్లు, రాధిక, మల్లేశ్వరి, రజని, అంగన్వాడీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు మణెమ్మ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.