ఉద్యోగానికే విరమణ.. వ్యక్తిత్వానికి కాదు..

Retirement is for job.. not for personality..– డీఈఓ శ్రీనివాస్ 
– ఉపాధ్యాయుడు తిరుపతి రెడ్డికి ఘన వీడ్కోలు 
నవతెలంగాణ – బెజ్జంకి
ఉద్యోగానికే విరమణనని..వ్యక్తిత్వానికి కాదని..సమాజాన్ని చైతన్యపర్చడానికి అడ్డంకుల్లేవని డీఈఓ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని గుండారం ప్రభుత్వోన్నత పాఠశాలలో గణితశాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న చెలుకల తిరుపతి రెడ్డి ఉద్యోగ విరమణ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వీడ్కోలు సమావేశానికి డీఈఓ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మండల విద్యాశాఖ అధికారులు,ఉపాధ్యాయులతో కలిసి తిరుపతి రెడ్డి దంపతులను శాలువ కప్పి సన్మానించి జ్ఞాపికను అందజేసి ఘన వీడ్కోలు పలికారు.గుండారం ప్రభుత్వోన్నత పాఠశాలకు తిరుపతి రెడ్డి సహయసహాకారాలు అందించి ఎనలేని కృషి చేశారని..సహచర ఉపాధ్యాయ సిబ్బంది,విద్యార్థులు మరువలేనివని ప్రధానోపాద్యాయురాలు నాగమణి కొనియాడారు. అంతకుముందు మండలంలోని అయా గ్రామాల ప్రభుత్వోన్నత,ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు తిరుపతి రెడ్డి దంపతులకు శాలువ కప్పి ఘన వీడ్కోలు పలికారు.ఎంఈఓ పావని,నోడల్ అధికారి హేమలత,కాంప్లెక్స్ ప్రధానోపాద్యాయులు,అయా సంఘాల ఉపాధ్యాయులు,గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హజరయ్యారు.
సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనం..
ఉద్యోగ విరమణ పొందుతున్న దృష్ట్యా ఉపాధ్యాయుడు తిరుపతి రెడ్డి తన సొంత ఖర్చులతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఘన వీడ్కోలు పలికారు.