– ఎంపిపి బాదవత్ రమేష్ నాయక్, పిడి చందర్ నాయక్..
నవతెలంగాణ -డిచ్ పల్లి
ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరిగా ఉంటుందని పంచాయతీ రాజ్ లో గ్యాంగ్ మేన్ గా సేవలు అందజేసి శుక్రవారం పదవి విరమణ చేస్తున్న ఇందల్ వాయి మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన వెల్లుల్ల నర్సయ్య కు ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో ఇందల్ వాయి మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎన్నోసార్లు ఆటుపోట్లు ఎదురైనా రాహదరి వేంట గుంతలు పడిన వెంటనే దాన్ని సరిచేస్తు ప్రమాదాలు జరగకుండా విశేష కృషి చేశారని,అయన చేసిన సేవలను ఎంపీపీ కోనియడారు.ఒక అంకం ముగిసిందని ఇక కుటుంబ సభ్యులతో కలిసి శేష జీవితం గడపాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి అతిథిగా డిఅర్డిఎ పిడి చందర్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ సహజమన్నారు.తము విధులు నిర్వహించే సమయంలో ప్రజల ఆదరాభిమానాలు పోందడం మరువలేనిదన్నారు.అనంతరం నర్సయ్య కు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో ఎంపిడిఓ రాములు నాయక్, పంచాయతీ రాజ్ ఏఈ కిషన్ నాయక్,ఎంపిఓ రాజ్ కాంత్ రావు, జూనియర్ అసిస్టెంట్ విమలా బాయి, నాయకులు పరుశురాం నాయక్, రాజు నాయక్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.