ఉద్యోగ విరమణ సహజం

Retirement is natural– ప్రాధానోపాధ్యాయుడు భాస్కర్ రావుకు ఘనంగా సత్కారం
నవతెలంగాణ – మల్హర్ రావు
ఉద్యోగ విరమణ సహజమని, సేవలు మాత్రం జీవితకాలం అందించవచ్చని తాజా మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు అన్నారు.మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో గత కొన్నేళ్లుగా ప్రాదానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న మల్కా భాస్కర్ రావు సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా మల్కా భాస్కర్ రావు దంపతులకు పలువురు నాయకులు, తోటి ఉపాధ్యాయులు,పూర్వ విద్యార్థులు శాలువాలు, పూలమాలతో ఘనంగా సత్కరించారు.ఉద్యోగ విరణ ప్రతి ఉద్యోగికి సహజమని సేవలు మాత్రం జీవితాంతం అందించవచ్చన్నారు.ఉపాధ్యాయులుగా, ప్రాదానోపాధ్యాయులుగా విద్యార్థులకు అంధించిన సేవలు గొప్పవన్నారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ వైస్ ఛైర్మన్ మల్కా ప్రకాష్ రావు,సింగిల్ విండో డైరెక్టర్ వొన్న తిరుపతి రావు,ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.