పదవికి మాత్రమే విరమణ.. ప్రజాసేవకు కాదు : సర్పంచ్ చిన్నం లావణ్యమల్లేష్

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ ప్రజాసేవకు కాదని ధర్మాజీగూడెం తాజా మాజీ సర్పంచ్ చిన్నం లావణ్య మల్లేష్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ధర్మోజిగూడెం గ్రామపంచాయతీ పాలకవర్గ కాలపరిమితి పూర్తయిన సందర్భంగా శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సన్మానం సమావేశం గ్రామ పంచాయతీ కార్యదర్శి రాధారపు బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తాజా మాజీ సర్పంచ్ చిన్నం లావణ్య మల్లేష్,తాజా మాజీ వార్డు మెంబర్లను,మాజీ కో ఆప్షన్ సభ్యులను గ్రామ ప్రజలు,గ్రామపంచాయతీ సిబ్బంది శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం తాజా మాజీ సర్పంచ్ చిన్నం లావణ్య మల్లేష్ గ్రామపంచాయతీ సిబ్బందికి శాలువలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా చిన్నం లావణ్యమల్లేష్ మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలు గ్రామపంచాయతీ లోని ప్రజలకు అనేక సేవలు అందించడంతోపాటు సంక్షేమంలో, అభివృద్ధిలో గ్రామపంచాయతీని ముందంజలో నిలుపుటకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.అభివృద్ధిలో పాలుపంచుకుం టున్న వార్డు మెంబర్లు అధికారులకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.గడిచిన 5 ఏళ్లలో గ్రామంలో సిసి రోడ్లు,అండర్ డ్రైనేజీలు,స్మశాన వాటిక,డంపింగ్ యార్డ్,వీధి దీపాలు,క్రీడా ప్రాంగణం, పకృతి వనం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జెల్లా ఈశ్వరమ్మ ఉప సర్పంచ్ కొంతం రామకృష్ణ రెడ్డి వార్డు సభ్యులు పగిళ్ల శశికళ,ఊదరి జయమ్మ,ఏనుగు రవీందర్ రెడ్డి, పిసాటి బాలమణి,జంగం నవీన్,ముటుకులోజు ఉమా కో ఆప్షన్ సభ్యులు గుర్రం రవీందర్,డాకోజి లలిత గ్రామ వాస్తవ్యులు ప్రముఖ వ్యాపారవేత్త కొంతం భాస్కర్ రెడ్డి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.