తిరుగుప్రయాణమైన భక్తులు

నవతెలంగాణ-తాడ్వాయి : ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరు గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కు దేశం నలుమూలల నుండి భక్తులు పోటెత్తి వచ్చారు.నాలుగు రోజులుగా మేడారం పరిసర ప్రాంతాలు అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులతో కిట కిట లాడాయి.. అయితే నేడు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లు వనప్రవేశం జరుగుతున్న నేపథ్యంలో అమ్మవార్లను దర్శించుకున్నారు భక్తులు తిరిగి వారి వారి స్వగ్రామాలకు తరలి వెళ్తున్నారు..
భక్తుల తిరుగు ప్రయాణం సందర్భంగా ఆర్ టి సి బస్టాండ్ ప్రాంతం లోని క్యూ లైన్లు నిండిపోయాయి.ఇప్పటి వరకు దాదాపు పదివేల ట్రిప్పుల బస్సులు నదిచినట్లు అధికారులు తెలిపారు.భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన గుడారాలు,టెంట్లు కాళిగా దర్శనమిస్తున్నాయి.తమ యొక్క సామగ్రినీ,పిల్లలను చేతిలో పట్టుకొని తిరుగు ప్రయాణం సాగిస్తున్నారు.