జెరూలేసం: భారత్‌లో ఇజ్రాయిల్ నూతన రాయబారిగా రూవెన్ అజార్‌ను నియమించారు. ఈ నియామానికి ఇజ్రాయిల్ ప్రభుత్వం ఆదివారం ఆమోదం తెలిపింది. అలాగే శ్రీలంక, భూటాన్‌లకు కూడా రూవెన్ అజార్ ప్రవాస రాయబారిగా వ్యవహరిస్తారని ఇజ్రాయిల్ ప్రభుత్వం తెలిపింది. అజార్ ప్రస్తుతం రొమేనియాలో ఇజ్రాయిల్ రాయబారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీలో ఆయన ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారో ఇంకా వెల్లడికాలేదు. అజార్ 2014 నుంచి 2018 వరకూ అమెరికాలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయంలో ఉప రాయబారిగా పనిచేశారు. అజార్ అర్జెంటీనాలో జన్మించారు. 13 ఏళ్ల వయస్సులో కుటుంబంతో కలిసి ఇజ్రాయిల్‌కు వలస వచ్చారు. హిబ్రూ విశ్వ విద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాల అంశంలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు.