న్యాయవాది యుగంధర్‌ను ఫోన్లో పరామర్శించిన రేవంత్‌

 కాంగ్రెస్‌ అండగా ఉంటుందని భరోసా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ నాయకుల దాడిలోగాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న న్యాయవాది యుగంధర్‌ను టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదివారం ఫోన్లో పరామర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందనీ, భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఆదివారం ఉప్పల్‌లో ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్ర్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌, అధికార ప్రతినిధి సుధీర్‌రెడ్డి పరామర్శించారు.