నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ప్రజలను కలిసే ప్రజాదర్బార్‌ను కూలగొట్టి ప్రజలకు దూరమయ్యారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రగతి భవన్ వద్ద అబేద్య ఇనుప గేట్లను బద్దలు కొట్టి ప్రజలకు చేరువవుతున్నారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.