-ఇష్టాగోష్టిలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం పుష్పను అరెస్టు చేయడంతో ఎనుముల రేవంత్‌రెడ్డి పాన్ ఇండియా ముఖ్యమంత్రి అయ్యారని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సింగిల్ విండో ద్వారా ఆదేశాలు చేసేవని ఎద్దేవా చేశారు. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వల్ల రైతు బంధు పథకం ద్వారా అనర్హుల ఖాతాల్లో రూ. 22 వేల కోట్లు పడ్డాయని ఆరోపించారు.