నవతెలంగాణ – గోవిందరావుపేట
బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మరియు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షురాలు బత్తుల రాణి డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు బత్తుల రాణి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు సమావేశమై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా రాణీ మాట్లాడుతూ మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని అనుచిత వాక్యాలతో కించపరుస్తూ మాట్లాడడం సరికాదని అన్నారు దీన్ని అన్ని వర్గాల ప్రజలు పార్టీలు ముక్తకంఠంతో ఖండించారని అన్నారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ చైర్మన్ మాజీ కోరిక గోవింద నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా ఓట్లతోటి గెలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలలో ఒక మహిళ ఎమ్మెల్యే అని చూడకుండా మాట్లాడడం సరికాదని ఆయన తెలిపారు వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకుంటే దశలవారీగా ఆందోళన చేస్తామని పోరిక గోవిందునాయక్ హెచ్చరించారు గత అసెంబ్లీ సమావేశాలలో మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గానీ మాజీ మంత్రివర్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ మహిళలను కించపరచకుండా అమ్మ అని సంబోధిస్తూ మాట్లాడినారు గడిచిన ఐదు సంవత్సరాలలో సీతక్క ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఆమె అడగకుండానే ములుగు మీద ప్రేమతో మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ములుగు జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుగా మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపిక చేసింది అని మరిచిపోవద్దు అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు లాకావత్ నరసింహ నాయక్. మాజీ ఎంపిటిసి వెలిశాల స్వరూప. సీనియర్ నాయకులు అజ్మీర సురేష్. చుక్క గట్టయ్య. రఘువీర్. బొల్లం ప్రసాద్. కృష్ణారెడ్డి. సింగం చందర్. కరుణాకర్. భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.