– ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ప్రకటనకు కృతజ్ఞత
నవతెలంగాణ-జక్రాన్ పల్లి ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి ఆదివారం తెలిపారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని రైతులు బాధలు ఎదిగినటువంటి సీఎం గారు ఏకకాలంలోనే రెండు లక్షల రుణమాఫీ సర్వం సిద్ధం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు లు తదితరులు పాల్గొన్నారు