డీకేతో రేవంత్‌, తుమ్మల భేటీ

– బెంగళూరుకు బయలుదేరిన పీసీసీ చీఫ్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌లో చేరేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చిన బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును వెంటబెట్టుకుని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి శుక్రవారం బెంగళూరుకు బయలుదేరారు. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో వారు భేటీ కానున్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గ టికెట్‌ తుమ్మల ఆశిస్తున్న సంగతి విధితమే. అదే స్థానాన్ని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల కూడా ఆశిస్తుండటంతో వారి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. వారిద్దర్ని ఏ విధంగా సర్దుబాటు చేయాలనే అంశంపై రేవంత్‌, డీకే చర్చించనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు కాంగ్రెస్‌లో తుమ్మల చేరికకు మూహుర్తం ఖరారు చేయనున్నారు.