
మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన అనసూరి శ్రీనివాస్ అనే ధాన్యం వ్యాపారి తాను ఇద్దరం కలిసి వానాకాలం సీజన్లో మల్లారం, పెద్దతూండ్ల గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు చేసిన నేపథ్యంలో తనకు తప్పుడు లెక్కలు చూపి మోసం చేసినట్లుగా పెద్దతూండ్ల గ్రామానికి చెందిన ధాన్యం వ్యాపారి రెవెళ్లి సంతోష్ శనివారం ఆరోపించాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పెద్దతూoడ్ల గ్రామానికి సంబంధించిన 5గురు రైతల ధాన్యం డబ్బులు దాదాపు రూ.10 లక్షలు ఇవ్వాలని తెలిపాడు. రైతులకు డబ్బులు ఇవ్వాలని కోరితే నీకు దిక్కున్న చోట చెప్పుకో అన్నట్లుగా ఆవేదన వ్యక్తం చేశాడు.తాను 5 లారీల ధాన్యం పంపగా తనకు క్వింటాల్ కు రూ.260 చొప్పున వచ్చిన లాభం రూ 4లక్షలు,ఆలాగే తాను బార్డాన్,సుతిల్ కింద ఖర్చులు పెట్టిన రూ 3 లక్షలు,మొత్తం రూ.7 లక్షలు తన ఖాతాలో జమ చేసినట్లుగా వివరించాడు.కానీ రైతులు విక్రయించిన ధాన్యం డబ్బులు మాత్రం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా వాపోయాడు.