రెవిన్యూ మేళా సద్వినియోగం చేసుకోవాలి 

– మున్సిపల్ ఛైర్మన్ ఆకుల రజిత
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే రెవిన్యూ మేళాను సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ మున్సిపల్ ఛైర్మన్ అకుల రజిత వెంకన్న అన్నారు. మంగళవారం హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో రెవిన్యూ మేళాను  చైర్మన్ ఆకుల రజిత ప్రారంభించారు రెవెన్యూ మేళా నేటి నుండి ఈనెల 31 వరకు ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారాల్లో, ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1-30 ని,ల వరకు ఉంటుందన్నారు. హుస్నాబాద్ పట్టణ ప్రజలందరూ సమస్యలతో పాటు రెవెన్యూ విభాగమునకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నచో రెవెన్యూ మేళాలో సమస్యలు పరిష్కరించుకోవలని సూచించారు.రెవెన్యూ మేళాలో గతంలో చెల్లించిన ఇంటి పన్ను రసీదు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లింకు డాక్యుమెంట్లు ఈసీ ఇంటి ఫోటో ఇంటి పర్మిషన్ ప్రతి అనుమతి కాపీలు రెవెన్యూ మేళాలో సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, బోజు రవీందర్, కమిషనర్  మల్లికార్జున్ , పురపాలక సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.