– మాడ్గుల ఎంపీటీసీ కొత్త పాండుగౌడ్
– వివిధ దినపత్రికలలో తహసీల్దార్ సమయపాలన పై వచ్చిన వార్తలకు కదలిక
– తహసీల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ
– వ్యవసాయ శాఖ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరుపై ఆరా
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్
మాడ్గుల తహసీిల్దార్ కొన్ని రోజులుగా విధులలో ఆలస్యంగా హాజరవుతూ ప్రజల ఇబ్బందులకు గురవుతు న్నారు అంటూ వివిధ దినపత్రికలలో వెలువడిన వార్త లకు ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ్గుల ఎంపీటీసీ కొత్త పాండు గౌడ్ స్పందించారు. స్థానిక మాజీ ఉపసర్పంచ్ మిద్దె రాములు రైతుల, ప్రజలు, నాయకు లతో కలిసి శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంతో పా టు వ్యవసాయశాఖ, ప్రాథమికఆరోగ్య కేంద్రాలను ఆక స్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 11 దాటిన తహసీ ల్దార్ కార్యాలయానికి రాకపోవడంతో ఆయన తీవ్ర అసం తప్తి వ్యక్తం చేశారు. వివిధ అవసరాల నిమిత్తం పదుల సంఖ్యలో కార్యాలయం ఎదుట ఆయన కోసం ఎదురు చూస్తున్న రైతులను చూసి ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆర్డీవో ఇబ్రహీంపట్నంకు ఫోన్ చేసి మాట్లాడారు. కొన్ని రోజు లుగా తహసీల్దార్ విధుల పట్టా నిర్లక్ష్యం చేస్తున్నాడని తహసీల్దార్ తో పాటు కార్యాలయం సిబ్బంది కార్యాలయంకు అందు బాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను కోరారు. తహ సీల్దార్‌తో మాట్లాడి సరిచేస్తానని ఆర్డీవో బదులిచ్చారు. 11:20 నిమిషాలకు కార్యాలయానికి వచ్చిన తహసీల్దా ర్‌తో ఎంపీటీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు విధు లకు ఆలస్యంగా వస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చే యడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతి రోజు రాత్రి సమయం వరకు విధులు నిర్వహిస్తున్నానని ఉదయం గంట లేటుగా వస్తున్నానని సరి చేసుకుంటారని సమాధానం ఇచ్చారు. కార్యాలయం లో ప్రజలకు సం బంధించిన ఎలాంటి పనులు మాత్రం పెండింగ్లో లేవని చెప్పారు. ఇన్‌టైంలో కార్యాలయంలో అందుబాటులో ఉం డి, సిబ్బందిని సైతం ఉంచాలని ప్రజలకు ఇబ్బందులకు గురిచేయొద్దని ఎంపీటీసీ పాండు గౌడ్ కోరారు. అనం తరం వ్యవసాయశాఖ కార్యాలయం సందర్శించి సీజనల్ సమయం ఉందందున రైతులకు అందుబాటులో ఉండా లని మండల వ్యవసాయ అధికారి గౌతమ్ కుమార్‌ను కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వస తులపై ఆరాతీశారు. మెడికల్ ఆఫీసర్ సూచించిన విధంగా ఎలక్ట్రికల్, ప్లంబర్ పనులకు సంబంధించి పనులను అక్కడ ఉండి చేయించారు. ఆస్పత్రిలో ఇతర సమస్యల పరిష్కారానికి కషి చేస్తానని హామీ ఇచ్చారు. మాడ్గుల మాజీ ఉపసర్పంచ్ అన్నపాక మిద్దె రాములు, గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు.