సహాయక చర్యలు చేపట్టిన రెవెన్యూ అధికారులు

నవతెలంగాణ- బోధన్ టౌన్
సహాయక చర్యలు చేపట్టిన అధికారులు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో బోధన్ పట్టణంలోని పలు వార్డుల్లో కొన్ని ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెవెన్యూ సిబ్బంది గురువారం సహాయక చర్యలు చేపడుతూ ప్రత్యామ్నాయంగా వేరే ఇల్లులను చూపించడం  జరుగుతుంది. రెవెన్యూ సిబ్బంది పట్టణంలో తిరుగుతూ కూలిపోయే పరిస్థితిలో ఉన్న ఇండ్ల సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ వరుణ్, సిబ్బంది ఉన్నారు.