– హార్డ్‌విన్ వెల్లడి
హైదరాబాద్ : తాము కొత్తగా ఏర్పాటు చేసిన అనుబంధ సంస్థ స్లిమ్ ఎక్స్‌తో రూ.100 కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హార్డ్‌విన్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. తమ ఈ సంస్థ అత్యాధునిక సాంకేతికతతో అల్యూమినియం ఉత్పత్తులను తయారు చేయనున్నట్లు పేర్కొంది. రూ.20 కోట్ల ప్రారంభ పెట్టుబడితో వచ్చే రెండేళ్లలో రూ.100 కోట్ల రెవెన్యూ అంచనా వేస్తున్నట్లు హార్టవిన్ ఎండి రుబుల్‌జీత్ సింగ్ సయాల్ పేర్కొన్నారు. అల్యూమినియంలో ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్, లైటింగ్, ఎలక్ట్రానిక్స్ తదితర వాటిలో అల్ట్రా స్లిమ్ ప్రొఫైల్‌లను అభివృద్థి చేయనున్నట్లు తెలిపారు.