బిజెపి మతోన్మాద, కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టండి

– సిఐటియు జిల్లా కోశాధికారి జి. భాస్కర్.
నవతెలంగాణ-తొగుట : పెరుగుతున్న దరలకు అనుకూలంగా కార్మికులకు కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలని సిఐటి యు జిల్లా కోశాధికారి జి. భాస్కర్ అన్నారు.గురు వారం సిఐటియు మండల స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కార్మిక వర్గ పరిస్థితిలు రోజు రోజుకు దిగజారుతున్నాయనీ ఆవేదన వ్యక్తం చేశా రు.పెరుగుతున్న దరలకు అను గుణంగా కార్మికుల కు కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలని
డిమాండ్ చేశారు.అనేక పోరాటాలు జరుగుతున్న వీటిని పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలతో, కార్మిక చట్టాల మార్పు కోసం బిజెపి నిరంకుశంగా వ్యవహరిస్తుందని విమ ర్శించారు.ప్రభుత్వ రంగ సంస్థలను గుండు గుత్తగా కార్పొరేట్ ధనవంతులకు అప్పగిస్తూ లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తూ దేశ సంపదన లూటీ చేస్తున్నారని మండిపడ్డారు.కార్మిక వర్గ ఐక్యతను విచ్చినం చేసే విధంగా కుల,మత వైశమ్యాలు సృష్టి స్తూ బిజెపి పరిపాలన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్మికులు,కర్షకులు సంయక్తంగా అఖిల భారత స్థాయిలో ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ పోరాటాలు చేస్తున్నా రని గుర్తు చేశారు.దేశవ్యాప్తంగా నివాస ప్రాంతాల్లో ఉన్న కార్మిక వర్గ కుటుంబాలను కలిసి,కార్మిక వర్గం లో ప్రచారం చేయాలని పిలునిచ్చారు.బిజెపి యొక్క మతోన్మాద ప్రమాదాన్ని నివారించి మోడీ ని గద్దె దించడానికి కార్మిక వర్గం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.మోడీ ప్రభుత్వంలో ఆకలి,
ఉపాధి,నిరుద్యోగం, దారిద్యం,ఆకలి చావులు, ఆత్మహత్యలు రోజురోజుకీ పెరిగి ప్రపంచ స్థాయిలో మన దేశ సూచి దిగజారి పోతుందన్నారు. కార్పొ రేట్,కమ్యూనల్ విధానాలు ఐక్యంగా కలిసి కార్మిక వర్గ ఐక్యతను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నా యనీ దీనిని కార్మిక వర్గానికి అర్థం చేయించాడానికి కార్మికులు,రైతులు ఐక్యంగా కలిసి మోడీ విధానాల కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలన్నారు.నెలరోజులపాటు జిల్లాల్లో,
మండలాల్లో ప్రదర్శనలు,సభలు, సమవేశాలు, కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించి,ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన కార్య క్రమంలో కార్మికులు పాల్గొంటారని తెలిపారు.అనం తరం సిఐటియు తొగుట మండల కన్వీనర్ గా ఈ. వసంత ఎన్నిక చేసినట్లు చెప్పారు.ఈ కార్యక్రమం లో శంకర్, నాగరాజు, ప్రభాకర్,స్వామి,మల్లేశం, ప్రవీణ,భాగ్య లక్ష్మి,స్వరూప,మహేశ్వరి,లక్ష్మి, తది తులు పాల్గొన్నారు.