మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం రోజున మండల ప్రత్యేక అధికారి డిపిఓ మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ ఆపరేటర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పారిశుధ్య పనుల గురించి, డోర్ టు డోర్ చెత్త సేకరణ,ఇంటి పన్ను వసూల్, వృత్తి వ్యాపార లైసెన్స్ వసూల్, సెగ్రిగేశన్ షెడ్ ఉపయోగం, అక్రమ నిర్మాణ పనుల నిలిపివేత, మంచినీటి నిర్వహణ, గ్రామ పంచాయతీ రిజిస్టర్ల నిర్వహణ మొదలగు వాటిపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి అధికారులకు తమ సూచనలు చేశారు. ఈ సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఐ ప్రవీణ్ కుమార్, మండల పంచాయతీ అధికారి కే రమేష్, మండల సహాయక ఇంజనీర్, ఉపవాస్తూ శాస్త్ర అధికారి, ఆర్ డబ్ల్యు ఎస్, మంథని,మండల వైద్యాధికారి సుస్మిత, కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.