వనమహోత్సవంపై  సమీక్ష సమావేశం..

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అధ్యక్షతన వనమహోత్సవం, ప్లాంటేషన్ పై  సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ  సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో వనమహోత్సవంలో భాగంగా ప్లాంటేషన్ కోసం మొక్కలను సిద్ధం చేయాలని ఆయా గ్రామాల పంచాయతీ ప్రత్యేక అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అదేవిధంగా గ్రామాల్లో నూతనంగా నిర్వహించనున్న మరుగుదొడ్ల సర్వేను వేగవంతం చేయాలని, కమ్యూనిటీ మరుగుదొడ్ల కాంప్లెక్స్ నిర్మాణాల విషయంలో స్థలాల సేకరణకు  చర్యలు తీసుకోవాలన్నారు.  పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగంగా ప్లాస్టిక్ వినియోగంపై చర్యలు చేపట్టాలని, పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులను త్వరగా పూర్తిచేసేలా కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో పంచాయతీరాజ్, రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులపై సమావేశంలో చర్చించారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఈజీఎస్ ఏపీవో విద్యనంద్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్లు, ఈజీఎస్ ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.