నవతెలంగాణ-పెన్‌పహాడ్
ముందస్తు సాగుతో గ్రామాల్లో ధాన్యం చేతికి అంది రావడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం తహసీిల్దార్ మందడి మహేందర్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులతో వరి పంట సాగు, దిగుబడి గురించి చర్చించి, డిమాండ్ మేరకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చర్చించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి కష్ణసందీప్, ఏపీఎం అజరు, వ్యవసాయ విస్తరణ అధికారులు గోపి, మనోజ్, సంధ్య, రేణుక, సుష్మ, పీఏసీఎస్ సీఈఓలు సోమ్లా, సైదులు, కొనుగోలు కేంద్రనిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.