
నవతెలంగాణ – భువనగిరి
పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండిగే అధికారులతో శనివారం సమీక్షించారు. కౌంటింగ్ కేంద్రంలో ఫర్నీచర్ ఏర్పాట్లు, పత్రాల సీలింగ్, వివిధ దశలలో కావలసిన సిబ్బంది నియామకం, ఉత్తర్వులు, స్కానింగ్ పనులు, లేబర్, సూపర్వైజర్ల ఏర్పాట్లపై, కేంద్రాలలో కావలసిన వసతులు ఇంటర్నెట్, పవర్ సప్లయ్, త్రాగునీరు, టాయ్లెట్స్, టెంట్లు, బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, తదితర ఏర్పాట్లు, కౌంటింగ్ స్టాఫ్ ర్యాండమైజేషన్, శిక్షణ, తదితర కార్యక్రమాల పట్ల తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. ఈకార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు పి.బెన్షాలోమ్, రెవిన్యూ డివిజనల్ అధికారులు అమరేందర్, శేఖర్రెడ్డి, భువనగిరి మున్సిపల్ కమీషనర్ రామాంజనేయులు రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి కె.నారాయణరెడ్డి, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రామ్మూర్తి, డి.టి. సురేష్, ఆర్.ఐ. శ్రీకాంత్ పాల్గొన్నారు.