సంక్షేమ పథకాలపై కేంద్ర సచివాలయ అధికారుల సమీక్షా 

– అంగన్వాడీ, కేజీవీబీ, నర్సరీల సందర్శన 
నవతెలంగాణ – బెజ్జంకి
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలపై కేంద్ర సచివాలయంలోని అయా శాఖల అధికారులు మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో బుధవారం సమీక్షా నిర్వహించారు. ఉపాధి హమీ,కిసాన్ సమ్మాన్ నిధి,అయుస్మాన్ భారత్,పోషక అభియాన్, ఫసల్ భీమా యోజన, ఎరువుల సరఫరా,వినియోగం,అక్షర అభియాన్, రైతు బందు,రైతు భీమా, మిషన్ భగీరథ,కల్యాణ లక్ష్మి,రైతుల నుండి వరిధాన్యం కొనుగోలు విధానం,ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వార బియ్యం పంపిణీ వంటి పథకాల అమలు తీరును ప్రోజెక్టర్ ద్వారా కేంద్ర సచివాలయ అధికారులు  సమీర్ కుమార్ ముండా,అశోక్ కుమార్,రాహుల్ కుమార్ సింహా,మేరీ నీలిమా మింజ్,సునితా కుంబరే, ప్రతిభ టోప్పోకు మండలంలోని అయా శాఖల అధికారులు వివరించారు. అనంతరం మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం, కస్తూరిభా గాంధీ విద్యాలయం, నర్సరీని క్షేత్ర స్థాయిలో కేంద్ర సచివాలయ అధికారులు సందర్శించి పరిశీలించారు. ఎంపీపీ నిర్మల,ఎంపీడీఓ దమ్మని రాము, తహసిల్దార్ ఎర్రోల్ల శ్యామ్,సూపరిడెంట్ అంజయ్య,ఎంపీఓ విష్ణు వర్థన్,ఏఓ సంతోష్,ఐసీడీఎస్ సూపర్ వైజర్ నాగారాణి,ఏఈ రేణుకా,పశువైద్యాధికారి శ్రీకాంత్ రెడ్డి అయా శాఖల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
కేజీవీబీలో పలు సమస్యల గుర్తింపు: మండల కేంద్రంలోని కేజీవీబీ విద్యాలయాన్ని కేంద్ర సచివాలయ అధికారులు సందర్శించి పరిసరాలను,తరగతి గదులు, విద్యార్థినిలకు అందజేస్తున్న భోజన వివరాల పట్టిక,గ్రంథాలయం, సౌకర్యాలను పరిశీలించారు.భోదన సిబ్బంది,విద్యార్థినిలతో అధికారులు మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థినిలు సద్వినియోగం చేసుకుని ఉన్నతాధికారులుగా ఉద్యోగాలు సాధించి పారదర్శకంగా ప్రజలకు సేవలందించాలని సూచించారు. కేజీవీబీ విద్యాలయాన్ని కేంద్ర సచివాలయ అధికారులు సందర్శించడంతో విద్యార్థినిలు హర్షం వ్యక్తం చేశారు. విద్యాలయంలో సీసీ కెమెరాలు పని చేయకపోవడం, విశాలమైన క్రీడా ప్రాంగణం లేకపోవడం, బోజనశాలలో సరైన వసతులు కల్పించకపోవడం, త్రాగు నీరు వంటి సమస్యలను అధికారులు గుర్తించారు. పంచాయతీ కార్యదర్శులు ప్రనీత్ రెడ్డి,మంద రమేశ్ సందర్శనలో పాల్గొన్నారు.