దక్షిణ కాశిగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయ అభివృద్ధిపై మంగళవారం చైర్మన్ ఛాంబర్ లో అధికారులతో సమీక్ష సమావేశాన్ని స్థానిక ఎమ్మెల్యే ,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర 2024-25 బడ్జెట్ నందు శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయము వేములవాడ అభవృద్ధి పనుల కు వి టి ఏ డి ఏ ద్వారా చేపట్టుటకు రూ.50 కోట్లు మంజూరు అయినట్లు వారు తెలిపారు.ఆలయ అభివృద్ధి పనులలో భాగముగా మొదటి దశలో ప్రాకార మండపం, మహా మండప విస్తరణ, అభిషేక మండపం, నిత్య కళ్యాణ మండపం, శ్రీ సత్యనారాయణ వ్రత మండపం, నిత్య నివేదన శాల మొదలగునవి నిర్మించుటకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థపతి శ్రీ వల్లీ నాయగం, ఆలయ కార్యనిర్వహణాధికారి, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశము నిర్వహించి అత్యవసరముగా ప్లాన్లు అంచనాలురూపొందించుటకు నిర్ణయించారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా శ్రీ శృంగేరి పీఠం వారితో చర్చించి అవసరమగు సలహాలు సూచనలు తీసికొని పనులు త్వరితగతిన చేపట్టుటకు నిర్ణయం తీసుకున్నారు.