సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేపట్టిన సమయపాల మార్పులు పునఃరుద్ధరించి పాత పద్ధతినే చేపట్టాలని శుక్రవారం మండల కేంద్రం శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఉదయం 9 గంటలకు పాఠశాల తరగతులు ప్రారంభం అయ్యేవని ప్రస్తుతం మార్పు చేసి 8 గంటలకు కుదించడం జరిగిందన్నారు. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఉన్నతాధికారులు గమనించి సమయపాలనను గతంలో గానే నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దేవి ప్రసాద్, సునీలా ప్రభ, శోభ, అనిత, వాణి, స్రవంతి, శ్రీదేవి, మమత, పవిత్ర, అఖిల, జ్యోతి, రేణుక, మాలతి, రాజ్యలక్ష్మి, నాజియా, దీపిక, స్వరూప తదితరులు పాల్గొన్నారు.