నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్‌ను పునరుద్ధరించాలని సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ఆదేశించారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఎలక్షన్‌కోడ్ కారణంగా వేలాది సీఎంఆర్‌ఎఫ్ దరఖాస్తులు నిలిచిపోయాయని తెలిపారు. గత ప్రభుత్వం జారీ చేసి మధ్యలో నిలిపివేసిన సుమారు 60 వేల చెక్కులను లబ్ధిదారులకు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఈ క్రమంలో ఒకట్రెండు రోజుల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం చెక్కులు పంపిణీ చేయనున్నది.