మిషన్‌కాకతీయతో చెరువులకు పునర్‌వైభవం

– తెలంగాణ ఫుడ్స్‌ చైర్మెన్‌ మేడే రాజీవ్‌సాగర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నాటి పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణలోని చెరువుల గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని, కానీ దశాబ్ద కాలంలో ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయతో వాటికి పునర్‌వైభవం దక్కిందని తెలవంగాణ పుడ్స్‌ చైర్మెన్‌ మేడే రాజీవ్‌సాగర్‌ తెలిపారు. ఒకప్పుడు ఎండకాలం రాకముందే ఊరి చెరువు ఎండిపోయి ఉండేదని, నేడు కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ కాకతీయ ద్వారా నడి ఎండకాలంలో సైతం చెరువులు మత్తడులు దూకుతున్నాయని ఆయన ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. మిషన్‌ కాకతీయలో తీసిన పూడిక మట్టి పొలాల్లో పోయడం ద్వారా పొలాల్లో సారం పెరిగిందన్నారు. చెరువుల పునరుద్దరణతో నీటి నిల్వ సామర్ధ్యం పెరగడంతో పాటు దాదాపు 4లక్షల మంది మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడిందని వివరించారు. చెరువుల మీద ఆధారపడ్డ ఎన్నో కులవృత్తులకు నేడు పునర్మ వైభవం వచ్చిందని పేర్కొన్నారు.
షర్మిల అబద్ధాలు
రైతన్న సంతోషంగా ఉండడం ఇష్టంలేకనే వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు షర్మిల అబద్దాలు ప్రచారం చేస్తున్నారని రాజీవ్‌సాగర్‌ వివరించారు. బీజేపీ టీమ్‌ పార్టీలను తెలంగాణ ప్రజలు పట్టించుకోవడం లేదనే బీఎస్పీ, వైఎస్‌ఆర్టీపీ నేతలు తమ పార్టీమీద అవాక్కులు చావాకులు పేలుతున్నారని విమర్శించారు.