నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
తన చిన్నతనంలోనే తల్లిదండ్రూలిద్దరు చనిపోయారని తనకు వచ్చే పెన్షన్ ఆగిపోయిందని ఓ బాలుడు వాపోయాడు. ఈ విషయమై సోమవారం ప్రజవాణిలో వినతిపత్రం అందజేశాడు. పట్టణంలోని పర్కోట కాలనీకి చెందిన అశుతోష్ వర్మ మహారాష్ట్రలో ఉండే మేనమామ ఇంటికి వెళ్లీ వసతిగృహాంలో ఉంటూ చదువుకుంటున్నట్లు పేర్కొన్నారు. తనకు రూ.4వేల పెన్షన్ వచ్చేదని 5 నెలలుగా పెన్షన్ రావడం లేదన్నారు.. అధికారులు తనకు పెన్షన్ వచ్చేలా పునరుద్దరించి న్యాయం చేయాలని కోరారు.