జమిలి ఎన్నికలను తిప్పికొట్టండి

Revoke Jamili's election– మోడీ ప్రభుత్వం తీసుకువస్తున్న ‘ఒక దేశం ఒకే ఎన్నిక’ విదానాన్ని వ్యతిరేకించండి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ఒక దేశం ఒకే ఎన్నిక పేరుతో మోడీ ప్రభుత్వం ముందుకు తెస్తున్న ప్రమాదకరమైన ఎత్తుగడలను ప్రజలందరూ వ్యతిరేకించి ఐక్యంగా తిప్పికొట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. ఆదివారం భువనగిరి మండల పరిధిలోని హన్మాపురం గ్రామంలో సీపీఐ(ఎం) 9వ మహాసభ గ్రామ నాయకులు బండి శ్రీనివాసు అధ్యక్షతన జరుగగా ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై,  మాట్లాడారు.  పార్లమెంట్‌ , రాష్ట్రాల శాసనసభలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కోవింద్‌ కమిటీ సిఫారసులను అమలు జరిగితే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థ దెబ్బతింటున్నదని అన్నారు. ఈ విధానం వల్ల లోక్‌సభ ఎన్నికతో పాటు నిర్వహించేందుకు వీలుగా కొన్ని శాసన సభల ఆయుష్షును కుదించేలా ఈ ప్రతిపాదనలు ఉన్నాయ అన్నారు. ఇవన్నీ కూడా రాజ్యాంగంలో నిర్దేశించిన ఐదేళ్ల పదవీ కాలానికి తమ ప్రతినిధులను ఎన్నుకునే ప్రజల హక్కును కాలరాయడమే నేనీ ఆవేదన వెలిబుచ్చారు. అన్ని పంచాయతీలు, మున్సిపల్‌ సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన సమాఖ్యవాదంపై దాడి తప్ప మరొకటి కాదని ఇది విపరీతమైన కేంద్రీకరణకు దారితీయడమే గాక, వికేంద్రీకరించబడిన స్థానిక సంస్థల నిర్ణయాధికారాన్ని హరిస్తుందని అన్నారు. పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని రాష్ట్రాలకు గల ఆ హక్కును ఇది నిరాకరించజూస్తున్నది భారతదేశానికి గల అపారమైన వైవిధ్యం, వివిధ రాష్ట్రాల్లో వుండే విభిన్నమైన పరిస్థితుల దృష్ట్యా ఇది పూర్తిగా అసంబద్ధమైన ప్రతిపాదన అని దీనిని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఒక దేశం, ఒక ఎన్నిక అనే భావన ఆర్‌ఎస్‌ఎస్‌- బిజెపి మానస పుత్రికని ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించే ఎలాంటి ప్రయత్నాన్నైనా సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ప్రజాస్వామ్యం, బహుళత్వం, సమాఖ్యవాదం వంటి వాటికి విలువిచ్చే పార్టీలన్నీ ముందుకొచ్చి ఈ ప్రమాదకర ఎత్తుగడను ఐక్యంగా తిప్పికొట్టాలని నర్సింహ పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ మాట్లాడు హన్మపురం నుండి వివిధ గ్రామాలకు వెళ్లే లింకు రోడ్లను వెంటనే ఏర్పాటు చేయడానికి వెంటనే నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. వడపర్తి కత్వను వెడల్పు చేసి ఈ ప్రాంతా రైతాంగానికి సాగునీరు అందించాలని దీని సాధన కోసం ప్రజలంతా ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభ ప్రారంభానికి ముందు జెండాను సీనియర్ నాయకులు రాచమల్ల నర్సింహ ఆవిష్కరించారు.  ఈ మహాసభలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు పాండాల మైసయ్య, శాఖ కార్యదర్శి మోటే ఎల్లయ్య, మాజీ ఎంపిటిసి దయ్యాల లక్ష్మి, సభ్యులు దయ్యాల మల్లేష్, తెలుజూరి మాణిక్యం, తోటకూరి అయిలయ్య, కుసుమ మాధవ్, రంగ సాయినాథ్, బాల్ద మల్లయ్య లు పాల్గొన్నారు.